కొరిశపాడు మండలం అనమనమూరు గ్రామంలోని పునరావాస కాలనీలో ఎస్సీ, బీసీలకు స్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచ్ జంపు హరిబాబు బుధవారం ఎర్రపాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు. నిరుపయోగంగా ఉన్న మెరకలను చదును చేయించాలని ఆయన మంత్రిని కోరగా, వెంటనే మట్టి తోలించి తగు చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాగూర్ భాష, గోపి తదితరులు పాల్గొన్నారు.