అద్దంకి RTC డిపో ఇన్‌ఛార్జి డిపో మేనేజర్‌గా మహబూబి సోమవారం బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన బెల్లం రామ్మోహన్‌రావు స్థానంలో, ఒంగోలు కార్గో విభాగంలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహబూబిని ఈ పదవికి నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం, బస్సుల సమయపాలనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందిస్తానని మహబూబి తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.