తుపాను ప్రభావంతో భారీగా పంట నష్టం జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గురువారం పర్చూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, మచిలీపట్నం నుంచి ప్రకాశం జిల్లాల వరకు వాగుల ఉధృతితో పంటలకు గణనీయమైన నష్టం కలిగిందని పేర్కొన్నారు. తడిసిన పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన భరోసా కల్పించారు.