పర్చూరులో తుఫాన్ కారణంగా నీట మునిగిన పంట పొలాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గురువారం పరిశీలించారు. రైతుల నుండి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి, ముఖ్యమంత్రికి నివేదిక అందజేసి ప్రతి రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.