అద్దంకిలో టైలరింగ్ యూనిట్ ప్రారంభం

4చూసినవారు
అద్దంకిలో టైలరింగ్ యూనిట్ ప్రారంభం
అద్దంకి పట్టణంలోని రామ్‌నగర్ ప్రాంతంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ యూనిట్‌ను బుధవారం ప్రారంభించారు. మెప్మా సిటీ మిషన్ మేనేజర్ సత్యవతి ఈ యూనిట్‌ను ప్రారంభించి, డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళల జీవనోపాధి మెరుగుదలకు మెప్మా ద్వారా రుణ సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా కోఆర్డినేటర్ శ్రీలత, రిసోర్స్ పర్సన్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్