బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బొబ్బాల సీతమ్మ అనే మహిళ ఇంట్లో వంట చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే సజీవ దహనమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.