May 15, 2026, 17:05 IST/రామగుండం
రామగుండం
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలి: కలెక్టర్
May 15, 2026, 17:05 IST
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండంలో నిర్మాణంలో ఉన్న 355 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రారంభంలో రూ. 160.3 కోట్లతో ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, ప్రస్తుతం పనులు పూర్తి చేయడానికి సుమారు రూ. 205 కోట్ల వ్యయం అవసరమవుతోందని కలెక్టర్ తెలిపారు.