
బాపట్ల: మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంచాలి
బాపట్ల పట్టణ నూతన మాస్టర్ ప్లాన్ విధానంపై తయారుచేసిన డ్రాఫ్ట్ ప్రజా వ్యతిరేకత పొందే విధంగా ఉందని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అన్నం సతీష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురపాలక సంఘ అధికారులు, పంచాయతీలలోని వార్డు, గ్రామ సచివాలయాల వద్ద మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, పట్టణ ప్రణాళిక అధికారి నేతృత్వంలో గ్రామ సభలు నిర్వహించి ప్రజలతో చర్చించిన తర్వాత నూతన మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆయన కోరారు.





































