బాపట్ల పట్టణంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన సంఘటనలో, బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి, బేతనికాలనీ సమీపంలో ఓ భవన నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికుడిని గుర్తించారు. ఆ వ్యక్తి బాలికను కొంత దూరం తీసుకెళ్లి వదిలి పరారయ్యాడు. ఈ ఘటనలో అతన్ని పనిలో పెట్టుకున్న మేస్త్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక క్షేమంగా ఇంటికి చేరడంతో, ఆమె బంధువులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.