బాపట్ల: ఎస్టియు నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా బడుగు

7చూసినవారు
బాపట్ల: ఎస్టియు నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా బడుగు
బాపట్ల జిల్లాలో ఎస్టీయు (రాష్ట్రోపాధ్యాయ సంఘం) నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులుగా బడుగ శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శిగా బొంతా వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక మంగళవారం బాపట్ల ఎన్జీవో హోంలో జరిగిన రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ 79వ కౌన్సిల్ సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్టీయు కర్లపాలెం మండలశాఖ అధ్యక్షులు వై. గుడేరంకయ్య, ప్రధాన కార్యదర్శి ఓ. శ్రీనివాసరావు, కోశాధికారి బి. సుబ్బారావు నూతన అధ్యక్ష, కార్యదర్శులను అభినందించారు.

ట్యాగ్స్ :