బాపట్ల జిల్లాలో ఎస్సీ, బీసీలకు గృహ నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న రూ. 1. 80లక్షలకు అదనంగా రూ. 50 వేల, ఎస్టీలకు రూ. 75 వేలు ఇచ్చేందుకు సన్నద్ధమైందని జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో సంయుక్త కలెక్టర్ ప్రకార్ జైన్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. 1685 గృహాల లబ్ధిదారులకు విడతల వారీగా వారి అకౌంట్ లో జమ చేస్తామన్నారు. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.