బాపట్ల పురపాలక సంఘ పరిధిలో, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. 32వ వార్డు హయ్యర్ నగర్ లో మున్సిపల్ కమిషనర్ జి. రఘునాథ రెడ్డి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన నూరుశాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు.