బాపట్ల పట్టణం శ్రీనివాస థియేటర్ వద్ద శుక్రవారం ద్విచక్ర వాహనంపై వెళుతున్న తండ్రి కొడుకులు గుంతలలో పడిపడి తీవ్ర గాయాలయ్యాయి. గత రెండు రోజుల క్రితం మున్సిపల్ సిబ్బంది గుంతలు తీసి వదిలి వేయటంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం విడి ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రోడ్డు పైన ఉన్న మట్టిని వెంటనే తొలగించాలని కోరారు.