బాపట్ల జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లి గ్రామం శివారు గవిని వారిపాలెం వెళ్లే రోడ్డులో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై దాడి చేసి హత్య చేశారు. స్థానికులు బాపట్ల రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై సమాచారం సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.