బాపట్ల: బాపట్ల_ మార్కాపురం రైల్వే లైను ఏర్పాటు చేయాలి ఎంపీ

12చూసినవారు
బాపట్ల: బాపట్ల_ మార్కాపురం రైల్వే లైను ఏర్పాటు చేయాలి ఎంపీ
బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి, బాపట్ల-మార్కాపురం మధ్య కొత్త బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి తక్షణమే సర్వే చేపట్టాలని వినతి పత్రం అందించారు. ఈ లైన్ బాపట్ల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు మీదుగా మార్కాపురం వరకు విస్తరిస్తుందని, ఇది బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల ఆకాంక్ష అని ఎంపీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్