బాపట్ల పట్టణంలోని బేతానికాలనీ, జగన్నాకాలనీలలో ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్న మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్ సోమవారం ఉదయం జగనన్న కాలనీకి నీటి సరఫరా చేసేందుకు వస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ప్రజలకు ఎటువంటి ప్రాణహాని జరగలేదు. రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉండటమే దీనికి కారణమని ప్రజలు తెలిపారు.