బాపట్ల పట్టణం పటేల్ నగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, పార్టీ అభిమానులు, ప్రముఖులు పాల్గొని విన్నకోట సురేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, రైలుపేటలోని ఎంఎస్‌ఆర్ కళ్యాణ మండపం సమీపంలో కేక్ కటింగ్ జరిగింది. జనసేన పార్టీ నినాదాలతో ఈ వేడుకలు పండుగ వాతావరణంలో సాగాయి.