బాపట్ల జిల్లాలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ గురువారం ప్రారంభించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రహదారి భద్రతకు సంబంధించిన ప్రచార బ్యానర్లు, పోస్టర్లను విడుదల చేశారు. ఈ మాసోత్సవాలు ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించబడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.