బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ వారు, గత మూడు సంవత్సరాల ఆస్తి పన్నుగా 1 కోటి 73 వేల రూపాయలు చెక్కు రూపంలో బాపట్ల మునిసిపల్ కమిషనర్ జి. రఘునాథ రెడ్డికి గురువారం అందజేశారు. ఈ చెల్లింపుతో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల వసూళ్లలో 95% సాధించింది. కమిషనర్ మాట్లాడుతూ. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.