ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఆర్మీలో చేరాలనుకునే యువతకు సువర్ణావకాశం.. రాత పరీక్ష లేదు
Jul 14, 2026, 07:07 IST/

ఆర్మీలో చేరాలనుకునే యువతకు సువర్ణావకాశం.. రాత పరీక్ష లేదు

Jul 14, 2026, 07:07 IST
భారత సైన్యం 2027 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సులో చేరడానికి అర్హత కలిగిన అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ 350 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ లేదా బీటెక్‌ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆగస్టు 7వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా గ్రాడ్యుయేషన్‌ మార్కులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.