బాపట్ల: నల్లమడ వాగు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు

10చూసినవారు
బాపట్ల: నల్లమడ వాగు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు
గురువారం బాపట్ల మండలం జిల్లెళ్లమూడి గ్రామం వద్ద నల్లమడ వాగు తుఫాను వరద ప్రభావంతో ఉధృతంగా ప్రవహిస్తున్నది. కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ నల్లమడ వాగును పరిశీలించి, అధికారులను అప్రమత్తం చేశారు. గ్రామంపైకి ముంచుకొస్తున్న వరదలను అరికట్టడానికి, ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఇసుక బస్తాలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :