రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఇనకొల్లు పోలీసు రావు మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభను పదును పెట్టడమే చెక్కుముకి పరీక్షల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మంగళవారం కర్లపాలెం మండలంలోని రాజుపాలెం గ్రామంలోని జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు చెకుముకి టాలెంట్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు విద్యార్థుల శక్తి సామర్థ్యాలకు చక్కని పరీక్ష అని, వారి ప్రతిభను ప్రోత్సహిస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.