బాపట్ల మండలం స్టూవర్టుపురం గ్రామంలో బుధవారం జరిగిన 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో లోక్ సభ ప్యానల్ స్పీకర్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి పార్టీల కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.