బాపట్ల సూర్యలంక సాగర తీరానికి భక్తులు, పర్యాటకులు, సందర్శకులను ఈనెల 4, 5 తేదీల వరకు అనుమతించబోమని ఆర్డీవో గ్లోరియా తెలిపారు. సోమవారం తహసిల్దార్ హసీనా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డితో కలిసి తీర ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటకాన్ని నిలిపివేసినట్లు, ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె వెల్లడించారు.