బాపట్ల: లారీ ఢీకొని మహిళ మృతి

1044చూసినవారు
బాపట్ల పట్టణం పాత బస్టాండ్ వద్ద గురువారం లారీ ఢీకొని మహిళ మృతి చెందింది. మహిళ రోడ్డు మీద వెళుతూ ఉండగా వెనకవైపు నుంచి అతివేగంగా లారీ ఢీకొనటంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మహిళ ఎవరు అనేది వివరాలు తెలియాల్సి ఉంది. బాపట్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.