భాస్కరరావు సేవలు చిరస్మరణీయం మాజీ ఎమ్మెల్యే కోన

11చూసినవారు
భాస్కరరావు సేవలు చిరస్మరణీయం మాజీ ఎమ్మెల్యే కోన
బుధవారం బాపట్ల పట్టణంలో కీర్తిశేషులు బాపట్ల కాపు సేవా సంఘం గౌరవాధ్యక్షులు పర్వత రెడ్డి భాస్కరరావు సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు, సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకట రామారావు పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాపు సమాజానికి భాస్కర్ రావు చేసిన సేవలను వారు ఈ సందర్భంగా కొనియాడారు. బాపట్ల కాపు సేవా సంఘం అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు, బాపట్ల పట్టణ, మండల కాపు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్