శనివారం తెల్లవారుజామున స్టూవార్టుపురం-బాపట్ల స్టేషన్ల మధ్య రైలు ఢీకొని సుమారు 35 ఏళ్ల యువకుడు మృతిచెందాడు. మృతుడు అయిదడుగుల ఆరంగుళాల పొడవు, ఎరుపు రంగు కలిగి ఉన్నాడు. అతని ఒంటిపై తెలుపు లైట్ క్రీమ్ కలర్ చొక్కా, బ్లూ కలర్ లోయర్ ఉన్నాయి. కుడిచేతిపై 'మామ్ డాడీ, నేహా' అని పచ్చబొట్టు, కుడి కాలికి నలుపు దారం ఉన్నాయి. మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆచూకి తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపారు.