శనివారం బాపట్లలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో సంఘ జెండాను ఆవిష్కరించి, కార్మిక ఉద్యమాల ప్రాధాన్యతను నాయకులు వివరించారు. సీఐటీయూ నాయకుడు శరత్ మాట్లాడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సంస్థ నిరంతరం పోరాడుతోందని, కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని కోరారు. కార్మిక చట్టాల మార్పులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, కనీస వేతనాన్ని రూ. 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.