చెరుకుపల్లిలో పెట్రోలు బంకును తనిఖీ చేసిన కలెక్టర్

1147చూసినవారు
చెరుకుపల్లిలో పెట్రోలు బంకును తనిఖీ చేసిన కలెక్టర్
బాపట్ల జిల్లా చెరుకుపల్లిలోని ఐఓసీ పెట్రోల్ బంకును సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేపట్టారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆరా తీశారు. వినియోగదారులతో మాట్లాడి ఇంధన సరఫరాలో ఇబ్బందులున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్