పదవీ విరమణ పొందిన ఎస్ఐను సన్మానించిన జిల్లా ఎస్పీ

5చూసినవారు
పదవీ విరమణ పొందిన ఎస్ఐను సన్మానించిన జిల్లా ఎస్పీ
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, సుదీర్ఘకాలం పోలీస్ శాఖకు సేవలు అందించిన ఎస్ఐ మల్లవరపు శ్రీనివాసులును ఆదివారం ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు పలికారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఎస్పీ శ్రీనివాసులును పూలమాలలు, దుశ్శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. పలువురు పోలీస్ అధికారులు కూడా ఆయనను సన్మానించారు. పోలీస్ శాఖకు ఆయన చేసిన సేవలను ఎస్పీ కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్