బాపట్ల జిల్లాలో ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ భావన స్పష్టం చేశారు. ఆదివారం కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో పెట్రోల్, డీజల్ సరఫరా పరిస్థితిపై వివరించారు. ఆయిల్, గ్యాస్ కంపెనీలతో మాట్లాడి కొరత లేకుండా చూస్తామని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.