ఏసీబీ అధికారినంటూ మోసం.. ఉద్యోగుల నుంచి డబ్బుల వసూళ్ల యత్నం

0చూసినవారు
ఏసీబీ అధికారినంటూ మోసం.. ఉద్యోగుల నుంచి డబ్బుల వసూళ్ల యత్నం
బల్లికురవ మండలంలో ఏసీబీ డీఎస్పీగా పరిచయం చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి, పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి, అవినీతి ఆరోపణలు చేస్తూ డబ్బులు డిమాండ్ చేసి బెదిరించిన ఘటన కలకలం రేపింది. ఎంఆర్వో, వీఆర్వోలకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరించినట్లు సమాచారం. భయాందోళనకు గురైన ఒక వీఆర్వో, సైబర్ నేరగాళ్ల ఖాతాకు యూపీఐ ద్వారా రూ. 1.50 లక్షలు పంపినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్