దివ్యాంగులకు ఉచిత కృత్రిమ చేతులు: కలెక్టర్

5చూసినవారు
దివ్యాంగులకు ఉచిత కృత్రిమ చేతులు: కలెక్టర్
చేతులు లేని దివ్యాంగులకు రెడ్ క్రాస్, రోటరీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా కృత్రిమ చేతులు అందజేయనున్నట్లు బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. బుధవారం బాపట్ల కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన "లెట్స్ ఎక్స్ప్లోర్" గోడపత్రికను ఆవిష్కరించారు. అవసరమైన దివ్యాంగులు 93469 11199, 98856 74767 నంబర్లకు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు చేయూతనివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్