బాపట్ల జిల్లా మార్టూరులో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అడ్వాంటా సీడ్స్ కంపెనీ మహిళా రైతులకు ఉచితంగా మొక్కజొన్న విత్తనాలు నాటే యంత్రాలను పంపిణీ చేసింది. మార్టూరు వ్యవసాయాధికారి లావణ్య ఈ యంత్రాలను రైతులకు అందజేశారు. నూతన సాంకేతికతతో తయారైన ఈ యంత్రాలు విత్తనాలు సమయానికి వేయడానికి, శ్రమ వ్యయాన్ని తగ్గించడానికి, దిగుబడిని పెంచడానికి సహాయపడతాయని తెలిపారు.