ఈదురుగాలులకు నేలకొరిగిన హోర్డింగ్

13చూసినవారు
ఈదురుగాలులకు నేలకొరిగిన హోర్డింగ్
బాపట్ల మండలంలో గురువారం రాత్రి వీచిన భారీ ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో హోర్డింగులు నేలమట్టమయ్యాయి. మండలంలోని వెదుళ్ళపల్లిలో జాతీయ రహదారి వెంబడి గల హోర్డింగ్ ఈదురు గాలులకు జాతీయ రహదారిపై పడిపోవటంతో శుక్రవారం ఉదయం అధికారులు తొలగింపు చర్యలు ప్రారంభించారు. క్రేన్ సహాయంతో హోర్డింగ్ తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.