ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలి దళిత నేత నీలం

5చూసినవారు
ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలి దళిత నేత నీలం
బాపట్ల జిల్లా దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేందర్రావు, బుధవారం జిల్లా డిఆర్వో గంగాధర గౌడ్ కు వినతి పత్రం అందించారు. బాపట్ల జిల్లా ఏర్పడి 4 ఏళ్లు గడిచినా, ఎస్సీ, ఎస్టీ హత్య, అత్యాచార కేసుల్లో బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు, నెలవారీ పెన్షన్లు అందజేయలేదని ఆయన పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కాకుమాను రవి, పట్రా బంగారం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్