
క్రెడిట్ స్కోర్ తగ్గకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి!
ఆర్థిక క్రమశిక్షణకు ప్రతిబింబమైన క్రెడిట్ స్కోరును కాపాడుకోవడం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డ్ బిల్లులు, రుణ చెల్లింపులను సకాలంలో చేయకపోవడం, క్రెడిట్ పరిమితికి మించి వాడటం, తరచుగా రుణాల కోసం దరఖాస్తు చేయడం, పాత ఖాతాలను బ్లాక్ చేయడం, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల బ్యాలెన్స్‌ను సరిగ్గా ఉపయోగించకపోవడం వంటివి క్రెడిట్ స్కోరు తగ్గడానికి కారణమవుతాయని నిపుణులు చెప్తున్నారు. ఆటో చెల్లింపులు, క్రెడిట్ నివేదికను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు.




