బాపట్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కోన ప్యానల్ విజయం

1811చూసినవారు
బాపట్ల కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (2026-30) డైరెక్టర్ల ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో కోన రఘుపతి–ప్రకాశ్ ప్యానెల్ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది. ఈ ప్యానెల్ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు గెలుపొందినట్లు ప్రాథమిక సమాచారం. విజేతల్లో అనంత నాగేశ్ బాబు, ఉమామహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, వెంకట కృష్ణారావు, జోగి ఆనంద్, కృష్ణమూర్తి, రఘురాం, రవికుమార్, జ్ఞాన సత్యప్రతాప్ ఉన్నారు. విజయం అనంతరం సోమవారం మద్దతుదారులతో కలిసి టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు.