పిట్టలవానిపాలెంలో లారీ, బైక్ ఢీ.. పలువురికి గాయాలు

54చూసినవారు
పిట్టలవానిపాలెంలో లారీ, బైక్ ఢీ.. పలువురికి గాయాలు
పిట్టలవానిపాలెం మండల పరిధిలోని భవనవారిపాలెం గ్రామపంచాయతీలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. లారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.  అతివేగమే ప్రమాదానికి కారణం. క్షతగాత్రులను బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒక వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్