
WWEని తాకిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్ (వీడియో)
RR బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి భారతదేశంతో పాటు విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. తాజాగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE) స్టార్ డ్రూ మెకింటైర్ జిమ్‌లో వైభవ్ జెర్సీ ధరించి కసరత్తు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి 'చూజెన్ వన్' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపై RR కెప్టెన్ పరాగ్ 'OMG' అని కామెంట్ చేశారు. కాగా, క్రికెట్ గురించి తెలియని వారు కూడా వైభవ్‌కు అభిమానులుగా మారుతున్నారు.




