బాపట్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

11చూసినవారు
బాపట్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బాపట్ల పట్టణంలోని 29వ వార్డులో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగశన నరేంద్ర వర్మ ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు ఆయన పెన్షన్ పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.