Top 10 viral news 🔥

కర్నూలు యాక్సిడెంట్.. యాంకర్ శ్యామల సహా 27మందిపై కేసు
AP: కర్నూలు బస్సు ప్రమాదంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిపినట్టుగా వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. యాంకర్ శ్యామల, కందుల గోపిశిక్ష, సీవీ రెడ్డి సహా 27 మందిపై కేసులు నమోదు చేశారు. కేసులో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అధికార ప్రతినిధులు కూడా ఉన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెట్టి అశాంతి సృష్టించారనే ఆరోపణలపై వీరిపై విచారణ కొనసాగుతోంది.




