భావన్నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే సమీక్ష

3చూసినవారు
భావన్నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే సమీక్ష
బాపట్ల పట్టణంలోని శ్రీభావనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 143 ఏళ్లుగా స్వామి కొలువై భక్తులను దీవిస్తున్నారని, స్వామి కృపతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉందని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మే 1వ తేదీన రథోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు.

సంబంధిత పోస్ట్