బాపట్లలో ఫిల్లింగ్ స్టేషన్లు తనిఖీ చేసిన అధికారులు

1194చూసినవారు
బాపట్లలో ఫిల్లింగ్ స్టేషన్లు తనిఖీ చేసిన అధికారులు
బాపట్ల పట్టణంలోని హెచ్పీసీఎల్ మిత్ర ఫిల్లింగ్ స్టేషన్‌లో సోమవారం బాపట్ల తహసిల్దార్ సలీమా, సిఎస్డిటి ఫణింద్ర కుమార్ తనిఖీలు నిర్వహించారు. ఫిల్లింగ్ స్టేషన్లో పెట్రోల్, డీజిల్ నిల్వలను పరిశీలించి, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మకాలు జరపాలని సిబ్బందికి సూచించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు ఆందోళన చెందవద్దని, పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తహసిల్దార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్