బాపట్ల సరస్వతి స్మారక బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం బాపట్ల, కర్లపాలెం, పిట్టల వాని పాలెం మండలాలలోని 1, 2 తరగతుల ఉపాధ్యాయులకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరస్సి (ఎఫ్ ఎల్ ఎన్) పై శిక్షణా తరగతులు నిర్వహించారు.
విద్యార్థులు ఆటపాటల ద్వారా సంతోషంగా విద్యను అభ్యసించడం, వారి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ సాధించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నిరంజన్, జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.