రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి నెల ఒకటో తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తుందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు తెలిపారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పెన్షన్లను యద్దనపూడి, మార్టూరు మండలాల్లో ఆయన పంపిణీ చేశారు. అనంతరం సురవరపల్లి గ్రామంలో రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టిడిపి నాయకులు పాల్గొన్నారు.