సూర్యలంక బీచ్‌లో ప్లాస్టిక్ నిషేధం

1చూసినవారు
సూర్యలంక బీచ్‌లో ప్లాస్టిక్ నిషేధం
సూర్యలంక బీచ్‌తో పాటు అడవి గ్రామపంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు ప్రత్యేక అధికారి జి. రామకృష్ణ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీచ్‌లో నిరంతరం పారిశుధ్య పనులు జరుగుతున్నాయని, ప్లాస్టిక్ విక్రయిస్తే రూ. 10 వేలు, వినియోగిస్తే రూ. 2 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పర్యాటకులకు డస్ట్‌బిన్‌లు వాడాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్