వచ్చేనెల 1 నుండి బాపట్ల లో ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్

1చూసినవారు
వచ్చేనెల 1 నుండి బాపట్ల లో ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్
బాపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుండి బాపట్లలో ప్రీమియం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు అంకమ్మ చౌదరి తెలిపారు. శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలల్లో జరుగుతుందని వెల్లడించారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ. 50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 25 వేలు, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ కు రూ. 5 వేల నగదుతో పాటు మెమొంటోలు అందజేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్