బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. రూ. 97.52 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టులు పర్యాటకులను మరింత ఆకర్షించేలా ఉండాలని సూచించారు. బీచ్ పరిసరాల్లోని మడ అడవులకు ఎలాంటి హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే, సింగపూర్ వంటి విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులకు సూచించారు.