బాపట్ల జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ బుధవారం కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అర్హులైన లబ్ధిదారులకే అందాలని, నిధుల మళ్లింపు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట కూడా పాల్గొన్నారు.